సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గత 10 ఏళ్ళు కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే ఏపీలో అన్ని హంగులు ఉన్న విశాఖ రాజధానిగా కొందరు ప్రతిపక్ష నేతలు కోర్టుల ద్వారా అడ్డుకొంటున్న నేపథ్యంలో హైదరాబాద్ ను మరికొంత కాలం ఉమ్మడి రాష్ట్రాల రాజధానిగా కొనసాగించేలా కేంద్రం చొరవ చూపాలని వైసీపీ కీలక నేత వై వి సుబ్బారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు అంతటి సంచలనం రేపాయో అందరికి తెలిసిందే.. అయితే లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఏపీ, తెలంగాణల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా..హైదరాబాద్‌ను మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. కాగా దీనిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి. ఇలా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగిన పక్షంలో ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం ఉందని రాజకీయ మేధావుల వాదన కూడా ఉంది.
