సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. అనకాపల్లి జిల్లా, పిసినికాడలో ‘వైఎస్సార్ చేయూత’ నాలుగో విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. 58 నెలల పరిపాలనలో అక్కచెల్లెమ్మల సాధికారితకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించాం. రాష్ట్రంలో 1,68,018 మంది అక్క చెల్లెమ్మలు కిరణా దుకాణాలు నడుపుతున్నారు. 3,80,466 మంది అక్కచెల్లెమ్మలు ఆవులు, గేదెలు కొన్నారు. 1,34,514 మంది గొర్రెలు, మేకలు పెంపకం చేస్తున్నారు. ఇప్పుడు 26,98,931 మందికి రూ.5,060 కోట్లు జమ చేస్తున్నాం’’ అని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే అన్ని మోసాలు వెన్నుపోట్లు , మహిళకు బిసి వర్గాలకు ,రైతులకు రుణమాఫి అంటూ. మహిళలకు పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది.ఇక దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడంటూ సీఎం మరోసారి ధ్వజమెత్తారు. వీరద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చిన మోసం చేశారు.2014 మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన వ్యక్తి చంద్రబాబు. పండంటి బిడ్డ పథకం పేరుతో మోసం చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుది. చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే. వీరిని నమ్మడం అంటే మనిషిని తినేసే పులిని ఇంటికి తెచ్చకోవడమే. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు. వీరు రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు’’ అంటూ సీఎం ఉద్ఘాటించారు.
