సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలో ఉన్న చందపర్రులో ఉన్న త్రిబుల్‌ ఎస్‌ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వారైతు సంఘం కార్యవర్గ సమావేశం ను జైభారత్‌ క్షీరారామ ఆక్వా సంఘం ఆధ్వర్యంలో అద్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు అధ్యక్షతన నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ..ఏపీలో ఆక్వా ఎగుమతులకు పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ప్రొసెసింగ్‌ యూనిట్ల యజమానుల హెచ్చుధరలు వల్ల..నియంతృత్వం వల్ల ఆక్వారైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. చెరువులలో రొయ్యలు పండిస్తున్న ఆక్వా రైతుల మేలు కోసం రొయ్యల ప్రొసెసింగ్‌ యూనిట్ల యజ మానులు తమ డిమాండ్లకు తగినట్లు న్యాయం చేయకపోతే ఈనెల 23న వేలాది మంది ఆక్వా రైతులతో ‘చలో భీమవరం ‘రూపొందించినట్లు భగవాన్‌ రాజుప్రకటించారు. ఈ కార్యక్రమం లో విశేషంగా రొయ్యల రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *