సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి జగన్ సర్కార్ వైఫల్యాలు తమకు ఓట్లుగా మార్చుకోవడం మాట దేవుడెరుగు.. ఎక్కడ చుసిన టికెట్ ఆశించిన అభ్యర్థుల మధ్య యుద్ధకాండ.. అసంతృపులు, స్వర్వం ఒడ్డిన ఆశావహులు కనీళ్ళు , శాపనార్ధాలు,ఇన్నాళ్లు మోసిన పార్టీ జెండాలను కార్యాలయాలలో మంటలు వేసి తగులబెట్టిన వైనం.. పార్టీ కోసం కష్టపడిన వాడీ నోరు కట్టి… వెన్నుపోట్లకు ప్యూహారచనలు .. హీరోలు విలన్ లు.. విలువలు లేవు ఈ ఎన్నికల బరిలో అన్నచందంగా తయారైంది. జనసేన అధినేత పిఠాపురం లో టీడీపీ నేతల అసమ్మతి బూతుల దండకం సోషల్ మీడియా లో బాగా ఉడుకుతుంది.. ఎన్నికల కోడ్ వచ్చేస్తున్నా కూటమి అభ్యర్థులు ఎంపికలో ఆలస్యం చెయ్యడమే అమృతం విషంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలు అన్నాక ప్రముఖ పార్టీలలో అసంతృప్తి ఉన్న నాయకుల చేష్టలు మాములే.. కానీ ఇప్పుడు సమస్య వారిని బుజ్జగించి దారికి తెచుకొనేది ఎప్పుడు? ఎన్నికలకు అంగబలం అర్ధబలం సమకూర్చుకొని వాటిని సమన్వయ పరిచేది ఎప్పుడు ? అధికార వైసీపీ పార్టీ అయితే ప్రతి నియోజకవర్గంలో ప్లాన్ A ప్లాన్ B అవసరమైతే.. ప్లాన్ C అభ్యర్థులను కూడా ఇప్పటికే సిద్ధం చేసుకొని , టికెట్ ఇవ్వలేని అసంతృప్త నేతలను 3 నెలల క్రితం నుండి వదిలించుకొని కూటమి పార్టీల పైకి వదిలేసి చేతులు కడుకొన్న వైనం.. ముచ్చట గొలుపుతుంది. మరి కూటమి పార్టీలు ఎంత తొందరగా ట్రాక్ క్లియర్ చేసుకొంటే అంత మంచిది. ఇక తాజగా మరో’రచ్చ- రచ్చ’ సీటు అంశం.. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం జనసేన ముందే కర్చీఫ్ వేసింది. అయిన దీనికోసం టీడీపీ నేతలు జలీల్‌ఖాన్, బుద్ధా వెంకన్న రచ్చ రచ్చ చేసారు. .ఇప్పుడు కొత్తగా కూటమిలో బీజేపీ దిగటంతో. ఆ సీటు బీజేపీకే కేటాయిస్తున్నట్లు తెలిసింది. దీనితో రాష్ట్రంలో తప్పనిసరిగా జనసేన మొదట గెలిచే సీటు గా ఆ స్థానాన్ని తయారుచేసుకొన్నానని భావిస్తున్న పోతిన మహేశ్‌కు జనసేన అధినేత పవన్ తప్పని పరిస్థితులలో రిక్త హస్తం చూపించడంతో .. అక్కడ కోపంతో రగిలిన జనసైనికులు పవన్‌కు పోతిన మహేశ్ స్వాతంత్ర అభ్యర్థిగా షాక్ ఇవ్వ డానికి రెడీ అయ్యారు. పోతిన మహేశ్ ఒంటరి పోరుతో కూటమికి భారీ దెబ్బ అని కదా ? అని ప్రశ్నిస్తే.. మరి పవన్ స్వయంగా పోటీ చేస్తున్న పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమెల్య వర్మ దూకుడు కు చంద్రబాబు ఎందుకు అడ్డుకట్టవెయ్యలేకపోతున్నాడో చెప్పాలని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు.. ఇక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ కూడా వస్తే చూడాలి.. కూటమిలో పోరాటాల పరాకాష్ట..
