సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ప‌ల్నాడు జిల్లాలో నేడు, ఆదివారం ఉదయం రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకునేందుకు కోటప్పకొండకు వెళ్తున్న బస్సు బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, దర్శి మండలం కొర్లమడుగు గ్రామాలకు చెందిన సుమారు 60 మంది కోటప్పకొండకు ఓ స్కూలు బస్సులో వెళ్తున్నారు. బస్సు కట్టర్‌ విరిగిపోవడంతో తిమ్మాయపాలెంలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో రోడ్డుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనాల్లో అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని 108 వాహనాల్లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పూర్తీ వివరాలు తెలియవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *