సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రేపటి సోమవారం నుండి పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో ఆర్.వెంకటరమణ తెలిపారు.‘ఈ నెల 18 నుంచి 30వ తేదీ మధ్య ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12–45 వరకు పరీక్షలు జరుగుతాయి. వీటికి రెగ్యులర్ విద్యార్థులు 21,341 మంది, గత పరీక్షల్లో తప్పిన వారు 6,085 మంది మొత్తం 27,426 హాజరుకానున్నారు. జంబ్లింగ్ విధానంలో విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. చీఫ్ సూపరింటెం డెంట్లు 127, డిపార్ట్‌మెంటల్ అధికారులు 127, మరియు 24 మంది సిట్టింగ్ స్క్వాడ్, 1390 మంది ఇన్విజిలేటర్లను నియమించారు . విద్యార్థులను పరీక్షకు ఉదయం 8.45 నుంచి 9.30 వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలు తీసుకురాకూడదు. సమస్యలు ఏవైనా ఉంటె జిల్లా కేంద్రం భీమవరంలోని కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నెంబరు 93467 26024కు ఫోన్ చెయ్యాలి. జిల్లాలో ఆరు సమస్యాత్మక కేంద్రాలైన శృంగవృక్షం,ఆరుగొలను, అల్లము పురం , పెనుమంట్ర, ఎంపి పాలెం, సీతారామపురంలలో సీసీ కెమేరాలను ఏర్పాటు చేసారు.
