సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: RRR విజయం తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో అగ్రదర్శకుడు దర్శకుడు శంకర్ తో ‘గేమ్ చెంజర్’ సినిమా చిత్రీకరణలో వున్నారు. విశాఖపట్నంలో చిత్రీకరణ జరుగుతోంది, ఇది ఇంకో పదిరోజులు ఉంటుందని, దీనితో సుదీర్ఘ కాలంగా షూటింగ్ జరుగుతున్న ‘గేమ్ చెంజర్’ సినిమాలో రామ్ చరణ్ చిత్రీకరణ భాగం పూర్తయినట్టేనని ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రిలీజ్ మాత్రం శంకర్ నిర్మిస్తున్న భారతీయుడు 2 తరువాతే బహుశా దసరాకు వస్తుందని భావిస్తున్నారు. ఇక ఉప్పెన వంటి సూపర్ హిట్ అందించిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సినిమాలో నటించడానికి రామ్ చరణ్ సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా లో దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ జంటగా నటించనుంది.ఒక పీరియడ్ డ్రామా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ముహూర్తం కూడా ఈ వేసవిలో ఏప్రిల్ నెలలో ప్రారంభిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *