సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అవినీతి నిరోధకశాఖ డీఎస్పీగా సుబ్బరాజు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. 1995 ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన సుబ్బరాజు తూర్పు గోదావరి, కృష్ణాజిల్లాలో ఎస్‌ఐ, సీఐగా పనిచేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎసీబీ సీఐగా పనిచేశారు. డీఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన విజయవాడ ఏసీబీ డీఎస్పీగా పనిచేశారు. అనకాపల్లి ఎస్‌డీపీవోగా పనిచేశారు. తిరిగి కొద్దినెలల కాలంలోనే ఆయన అక్కడ నుంచి బదిలీ అయ్యారు, తిరిగి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎసీబీ డీఎస్పీగా నియమితులయ్యారు. ఛార్జ్ తీసుకొన్న ఆయన మాట్లాడుతూ,, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అవినీతి అధికారుల సమా చారాన్ని 14400కు గాని, లేదా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏసీబీ డీఎస్పీ నంబర్‌ 94404 46157, సీఐల సెల్‌ నెంబర్లు 94404 46158, 94404 46159లకు సమాచారం అందించాలన్నారు.ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్‌ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కాని కార్యాలయాల్లో కాని అవకతవకలు జరుగుతుంటే సమాచారం ఇస్తే ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *