సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉన్న మొత్తం 3,650 మద్యం షాపులు చాలవన్నట్లు మరిన్ని మద్యం షాపులకు సంబంధించి లైసెన్సుల జారీ కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. . రాష్ట్రవ్యాప్తంగా లైసెన్సులు రెన్యువల్‌ చేసుకోని 414 మద్యం షాపులకు సంబంధించి కొత్త లైసెన్సుల జారీకి ఎక్సైజ్‌ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనితో నేటి నుంచి అక్టోబరు 1 రాత్రి 12 గంటల వరకూ ఈ షాపుల లైసెన్సులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 3న దరఖాస్తుల్ని పరిశీలించి.. అక్టోబర్ 5న లాటరీ తీసి లైసెన్సులు జారీ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *