సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సికింద్రాబాద్, సంత్రాగచి మధ్య నేటి శనివారం నుండి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ప్రకటించారు. రైలు నంబరు 07645/07646 శనివారం రాత్రి 9.05కి సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటిరోజు అర్ధరాత్రి 12.15కి సంత్రాగచి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు సంత్రాగచిలో ఈ నెల 25వ తేదీ ఉదయం 5.45కి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.10కి సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగు రాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం లలోఆగి తదుపరి రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఒరిస్సాలోని బరంపురం, భువనేశ్వర్, కటక్, బాలాసోర్ స్టేష న్లలో ఆగుతుంది.
