సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో పవిత్ర పంచారామ క్షేత్రంగా భాసిల్లుతున్న గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవాలయంలో నేడు ఫోల్గుణ పౌర్ణమి సోమవారం శుభ సందర్భంగా లోకకళ్యాణార్థం శ్రీ సోమేశ్వర స్వామి వారికి చక్కర తో అభిషేక నీరాజనం చేసారు. రంగులు మారే మహిమానిత శివలింగం పంచదారతో పోటీ పడి శ్వేత వర్ణంతో దర్శనమిచ్చింది. నేటి సాయంత్రం శ్రీ స్వామివారికి చేసిన పుష్ప దీపాలంకరణ తాజా చిత్రాన్ని పైన చూడవచ్చు..
