సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ కోతలు మొదలయ్యాయి. దీంతో ధాన్యం సేకరణకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. రబీలో 9.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచన కాగా 7.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు లక్ష్యంగా నిర్ణయించారు. ఎన్నికల కోడ్ ఉన్నపటికీ కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భీమవరం ఉండి నరసాపురం , పాలకొల్లు, నియోజకవర్గాలలో రైతులు కాస్త ఆలస్యంగా నాట్లు వేసిన నేపథ్యంలో ఇంకా పంట పూర్తిగా రాలేదని రైతులు అంటున్నారు. అయితే ముందుగా నాట్లు వేసిన తాడేపల్లిగూడెం, తణుకు, గణపవరం మండలాల్లో ఇప్పటికే వరికోతలు మొదలయ్యా యి. మరో వారం రోజుల్లోఆయా ప్రాం తాల్లోకోతలు జోరందుకుం టాయి. ఎకరాకు 50 కి పైగా బస్తాలు దిగుబడులు వస్తాయని అంచనా.. గత సీజన్లో దాదాపు 68,163 మంది రైతుల నుంచి రూ.924 కోట్ల విలువైన 4.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిం చారు. జేసీ ప్రవీణ్ ఆదిత్య ఆదేశాలు మేరకు జిల్లాలో రైతులకు గతంలో మాదిరిగా సత్వ ర చెల్లిం పులు చేసేం దుకు చర్య లు తీసుకుంటున్నారు.
