సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకు గ్రామ, వార్డు సచివాలయ వలంటీ ర్లు విధులకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు అమలులోకి వచ్చాయి. వాలంటీర్ లతో పెన్షన్ పంపిణీ చేయించ కూడదని, వారి వద్ద వున్న ఫోన్‌లు, సిమ్ కార్డులను తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 9,243 మంది వలంటీర్లు ఉండగా, ఇప్పటి వరకు నాలుగు వేల మంది సెల్ ఫోన్‌లు, సిమ్ కార్డులు అప్పగించారు. వందలాది వాలంటీర్లు స్వచ్చంధంగా తమ రాజీనామాలు సమర్పించి స్థానిక వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేతలకు కార్యకర్తలుగా మారిపోయారు. తమను, తమ ద్వారా పింఛన్ లు అందకుండా వృద్దుల, వికలాంగుల జీవితాలను అడ్డుకొంటున్న చంద్రబాబు కు సంబందించిన వ్యక్తులకు, టీడీపీ పార్టీ నేతలకు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికలలో వైసీపీ కి మద్దతుగా పనిచేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు.
