సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మొదటి జాబితా అభ్యర్థులను వై ఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది, కీలకమైన . కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ కి దిగుతున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులుగా .. 1. భీమవరం – అంకెం సీతారాము 2. ఉండి – వేగేశ వెంకట గోపాల కృష్ణంరాజు, 3. తణుకు – కడలి రామారావు, 4. తాడేపల్లిగూడెం – మార్నేడి శేఖర్, 5. పాలకొల్లు – కొలుకులూరి అర్జున్ రావు ఇప్పటివరకు ఎంపిక చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *