సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హెడ్‌ఫోన్స్‌ రెడీ చేసుకోండి. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ‘పుష్ప2’ టీజర్‌కు ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ప్ర‌సాద్ అందించిన సెన్సేషనల్‌ ‘బీజీఎం‘ రాబోతోంది’ అంటూ పుష్ఫ టీం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం పుష్ఫ ది రూల్‌. ఆగ‌స్టు 15 న పాన్ ఇండియా సినిమాగా థియేట‌ర్ల‌లోకి రానున్న ఈ సినిమా నుంచి గ‌తంలో ఓ టీజ‌ర్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ జ‌న్మ‌దినంను పుర‌స్క‌రించుకుని మ‌రో టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈనేప‌థ్యంలో చాలామంది అభిమానులు ఇప్పుడు ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *