సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయదేవర కొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ సినిమా నేడు, శుక్రవారం ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కూడా రిలీజవ్వగా అన్ని ప్రాంతాల నుంచి మిక్స్‌డ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమాలో మొదటి భాగంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్క్రీన్ ప్రజెన్స్ బావుందని.. ప్రస్తుత మద్య తరగతి కుటుంబాల సమస్యల ను కామిడి టచ్ తో బాగా తీసారని విజయ్, మృణాల్ జంట బాగుందని, రొటీన్ కథతోనే సినిమా లాగించారని, గీతా గోవిందం ఫార్మూలానే ఇక్కడా వాడారని, కామెడీ అంతటా వర్కౌట్ అవలేదని, సినిమాలో ఎక్కువ లాగుడు సన్నివేశాలు, టివి సీరియల్ తరహాలో తరచూ రిపీట్ డైలాగ్స్ ఉన్నాయని దీనితో ఫీల్ మిస్సయిందని, అయితే పాటలు సంగీతం బాగున్నాయని పబ్లిక్ టాక్.. భారీ అంచనాలతో వెళ్లకపోతే కుటుంబ సమేతంగా నచ్చుతుందని అంటున్నారు. కాస్త డివైడ్ టాక్ ఉన్నపటికీ ఈ వేసవి సెలవులు ఫ్యామిలీ స్టార్ సినిమాను కలెక్షన్స్ పరంగా ఒడ్డున పడేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
