సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ నెల 25న ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే జిల్లాల్లో విద్యార్థుల జవాబు పత్రాలకు ఉపాధ్యాయులు మార్కులు వేసే మూల్యాంకన ప్రక్రియ దాదాపు నేటి ఆదివారం మధ్యాహ్నానికి ముగియనుండగా, మిగతా తెలుగు ఫస్ట్ లాంగ్వేజి, హిందీ జవాబు పత్రాల మూల్యాంకనం రేపు సోమవారంతో పూర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాతే ఫలితా లను విడుదల చేస్తారు.
