సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎప్పుడు సీరియస్ కధ చిత్రాలలో నటించే విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ బిచ్చగాడు 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ సాధించాడు. ఇప్పుడు తాజాగా తొలిసారి వినోదాత్మకంగా సరికొత్తగా నటించిన ‘రోమియో’ అనే తమిళ సినిమా తెలుగులోకి ‘లవ్ గురు’ అనే పేరుతో ఈరోజు గురువారం ప్రేక్షకుల ముందుకు మృణాళిని రవి ఇందులో కథానాయకురాలు, వినాయక్ వైద్యనాధన్ దర్శకుడు. విజయ్ ఆంటోనీ తన సొంత బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కధ చెప్పాలంటే.. ఈ సినిమా కథ ప్రారంభం ముందుగా చిన్నప్పుడు అన్నాచెల్లెళ్ల పాత్రలతో ప్రారంభం అవుతుంది… తరువాత అరవింద్ (విజయ్ ఆంటోనీ) మలేషియాలో పని చేస్తూ బాగా డబ్బులు సంపాదించి సొంత ఊరుకి వస్తాడు. 35 ఏళ్ళు వచ్చిన అతనికి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని చెబితే, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అదే గ్రామంలో తన తండ్రి స్నేహితుడి కుమార్తె లీల (మృణాళిని రవి)ని చూసి పెళ్లిచేసుకుంటాను అని తల్లిదండ్రులకి చెప్తాడు, నిజానికి వారిద్దరి అభిప్రాయాలు కలవవు అని వారికీ ముందే తెలుసు.. అయిన లీలకి ఇష్టం లేకపోయినా, తండ్రి మాటని కాదనలేక అరవింద్‌ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లయ్యాక గ్రామం నుండి భార్యాభర్తలు ఇద్దరూ సిటీకి వచ్చేస్తారు. ఈ ఇద్దరికీ వయసులో పదేళ్లు వ్యత్యాసం. లీలకి పెద్ద హీరోయిన్ అయి పేరు తెచ్చుకోవాలని కోరిక, అందుకని సిటీకి వచ్చాక భర్త అరవింద్‌ని దూరం పెడుతుంది. తనలాగే సినిమాల్లో చేరాలనుకుంటున్న ముగ్గురు స్నేహితులను ఇంటికి రప్పించుకుంటుంది,తన భార్య ప్రేమను పొందేలా తనే భార్య కోసం తనే సినిమా నిర్మిస్తానని, అందులో హీరోగా తనే నటిస్తానని అరవింద్ చెప్తాడు. ఇక్కడి నుండి కధ చెల్లెళ్ల పాత్ర ఎంటర్ కావడంతో వినోదాత్మకంగా, సెంటిమెంట్ తో పలు మలుపులు తిరుగుతుంది. ఇవన్నీ ‘లవ్ గురు’ సినిమా లో చూడాల్సిందే. ఇక సినిమా ఎలా ఉందంటే.. ఇటువంటి కధలు శోభన్ బాబు బావమరదళ్ళు కాలం నుండి వస్తూనే ఉన్నాయి. కాకపోతే కధలో సిస్టర్ సెంటిమెంట్ వాడారు, మొదటి సగం అంతా కాస్త వినోదాత్మతంగా సాగుతుంది. కానీ రెండో సగం వచ్చేసరికి అంతా సినిమా షూటింగ్స్‌తో కాస్త సాగదీసినట్టుగా చూపిస్తాడు. అయితే అందరు బాగా నటించారు. నేపధ్య సంగీతం, ఛాయాగ్రహణం బాగున్నాయి, కాలక్షేపానికి ఒకసారి ఇబ్బంది లేకుండా చూసేయచ్చు.. లవ్ గురు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *