సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2 టౌన్ లోని అంబేద్కర్ సెంటర్ లో నేడు, ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఇతర వైసీపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో పేదలకు, అన్నగారిన ప్రజానీకానికి సమసమాజ స్థాపనకు అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం రక్షణ గా నిలుస్తుందని, గత రాత్రిఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పడేలా ఆగంతకులు వ్యవహరించారని విమర్శించారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయ స్ఫూర్తిని అమలు చేస్తున్న,పేదల, అణగారిన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం జగన్ మరోసారి సీఎం కాకుండదన్న కక్షతో చంద్రబాబు పవన్ వంటి నేతలు రెచ్చగొట్టుడు మాటల స్ఫూర్తి తో ఈ దాడి జరిగిందని, ఇటువంటి వారు ప్రజాస్వామయానికి ప్రమాదమని , జగన్ ఫై దాడి జరిగిన వెంటనే ఇది తప్పు అని ఖండించిన ప్రధాని మోడీ , ఇటువంటి ప్రమాదకరమైన నేతలతో పొత్తు విషయం ఫై మరోసారి పునరాలోచించుకొంటే మంచిదని అన్నారు.
