సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారీ నష్టాలలోకి జారిపోతున్న స్టాక్ మార్కెట్ కు ఈ రోజు కాస్త బ్రేక్ పడింది. నేడు, శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో లాభాల్లోకి పయనించాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ మిసైల్ ఎటాక్‌కు దిగిందనే వార్తల నేపథ్యంలో మార్కెట్ అప్రమత్తమైంది. అయితే తమ మీద మిసైల్ ఎటాక్ జరగలేదనే ఇరాన్ ప్రకటన మదుపర్లకు భరోసాను ఇచ్చింది. దీంతో దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి ప్రవేశించాయి. ఈ వారాన్ని లాభాలతో ముగించాయి.ఒక దశలో 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. 71,816 వద్ద ఇంట్రాడే లోని తాకింది. మధ్యాహ్నం తర్వత బాగా పుంజుకుంది. ఏకంగా 599 పాయింట్లు లాభపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *