సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతి దేవి పేట గ్రామంలో పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. తాజగా ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన పెద్దపులి రెండు ఆవులపై దాడి చేయడంతో అవి మృతిచెందాయి. ఈ భయానక ఘటనతో గ్రామస్థులు భయపడ్డారు. పశువులపై జరిగిన ఈ దాడి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మంగపతి దేవి పేట ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది గ్రామ ప్రజలను ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయట తిరగవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప రాత్రి సమయంలో పొలాలు, అటవీ ప్రాంతాల వైపు వెళ్లకూడదని తెలిపారు.పెద్దపులి కదలికలను గుర్తించేందుకు అటవీ శాఖ సిబ్బంది చర్యలు చేపట్టారు
