సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ ఫై విజయవాడలో జరిగిన రాయి దాడి నేపథ్యంలో ఇప్పటికే దాడికి పాల్బడిన కురాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఆ దాడి కి ప్రేరేపించిన పెద్దల కోసం విచారణ జరుపుతున్న నేపథ్యంలో బోండా ఉమా సన్నిహితుల పేర్లు కీలకంగా వినిపిస్తున్న నేపథ్యంలో.. ప్రముఖ టీడీపీ నేత బోండా ఉమా మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. గత శుక్రవారం రాత్రి వంద మంది పోలీసులు యుద్దానికి వచ్చినట్లు తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్సై లు, కానిస్టేబుళ్లు వచ్చారన్నారు. సీఎం పై గులకరాయి దాడి జరిగితే దాడి చేసిన వ్యక్తులు దొరికారు. ఇంకేముంది దానిని పెద్ద కేసు చేస్తూ తనను ఆ కేసులో భాగస్వామిగా చెయ్యాలని కుట్ర జరుగుతుందని ఆరోపించారు. దాడి లో ప్రధాన నిందితుడు వేముల సతీష్ తల్లి దండ్రులను అక్రమం గా నిర్బంధించారని బొండా ఉమా తెలిపారు.‘డీజీపీ, సీపీ, ఏసీపీ అంతా సిండికేట్గా ఏర్పడి టీడీపీ అభ్యర్థులపై వేధింపులకు కుట్ర పన్నారు. వడ్డెరగూడెంలో ఉండటమే వేముల దుర్గారావు పాపమా? ఏ సంబంధం లేని అతడిని తీసుకెళ్లి ఎక్కడ దాచారో తెలియదు. ఆరు రోజుల నుంచి దుర్గారావును జడ్జి ఎదుట ఎందుకు హాజరుపరచలేదు? మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చాక తప్పులు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు’’ అని బొండా ఉమా అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *