సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్- దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సలార్. గత ఏడాది డిసెంబరులో విడుదలై, 750 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించి మరోసారి ప్రభాస్ సత్తా చాటింది. దీంతో వెంటనే ‘సలార్’ రెండో భాగం ‘సలార్:శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్ నీల్. ప్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తి కావస్తుండటంతో ఇదే నెల చివరి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారభించనున్నారు. ఈ నేపథ్యం లో సలార్ మూవీ ఏప్రిల్ 21న ఆదివారం సాయం త్రం 5.30 గం టలకు స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ఈ సినిమాను చూస్తూ ఆ సినిమాలో హీరో ప్రభాస్ వాడిన బైక్ ను గెలుచుకోవచ్చని హోంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. ఏప్రిల్ 21న సలార్ సినిమాను చూస్తున్న సమయం లో స్క్రీ న్ పై ఒకవైపు బైకు కనిపిస్తూ ఉంటుందట, ఆ బైక్ ఎన్ని సార్లు స్క్రీన్ మీద కనిపించిందో ప్రేక్షకులు లెక్కబెట్టాలి. అదే సమయంలో sms లైన్లు ప్రారం భమౌతాయి. ఆ వెంటనే 9222211199 నంబర్ కు SALAAR అని టైప్ చేసి పంపించాలి. ఈ ఎస్సెమ్మెస్లను ఏప్రిల్ 21 రాత్రి 8 గంటల నుంచి పంపించాల్సి ఉంటుంది. కరెక్ట్ గా పంపిన వారి నుండి లక్కీ డీప్ లో ఒకరికి బైక్ అందిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *