సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అందరికి సుపరిచమైన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అతని పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎం ఆర్ ఓ వనజాక్షి ఫై దూకుడు ఎపిసోడ్ గుర్తుకు వస్తుంది. అయితే దెందులూరు లో మంచి స్థాన బలం ఉన్న టీడీపీ నేతగా సుదీర్ఘ కాలంగా పాతుకుపోయిన ప్రస్తుత టీడీపీ అభ్య ర్థి, చింతమనేని ప్రభాకర్‌ను తప్పిం చడాని రంగం సిద్ధమైంది. కారణం ఏలూరు జిల్లాలో బీజేపీ ఎంపీ స్థానానికి పోటీ పడిన తపన’చౌదరికి ఆ అసెంబ్లీ స్థానం కేటాయించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, దగ్గుబాటి పురందేశ్వరి చంద్రబాబు తో జరిపిన చర్చ లు ఫలించాయని తెలుస్తుంది. దానితో ఈసారి ఎవరు ఊహించని రీతిలో చింతమనేని కి టీడీపీ చెక్ చెప్పినట్లు తెలుస్తుంది. ఇదే తరహాలో నరసాపురం ఎంపీ సీటు ఆశించిన ఎంపీ రఘురామా కు ఉండి అసెంబ్లీ బి పారం ఇచ్చిన చంద్రబాబు అక్కడ ప్రచారంలో ఉన్న స్థానిక టీడీపీ ఎమెల్య రామరాజు కు జిల్లా పార్టీ అడ్జక్ష స్థానం కేటాయించడం గమనార్హం. గతంలో ఆ స్థానంలో కొనసాగిన తోట సీతారామ లక్ష్మి పార్టీ కేంద్ర బ్యూరో లో స్తానం కల్పించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *