సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో బహిరంగ సభలో తనను, సీఎం జగన్ ఫై తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలపై స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న బాషా ఆకురౌడీ బాషా అందరు చూస్తున్నారని, ఎదో సెంటర్ లో గొడవ పెట్టుకొందాం.. అక్కడికి రౌడీలతో రమ్మంటాడు.. నాదగ్గరైతే ఎవరు రౌడీలు లేరు కాబట్టి.. నువ్వే చంద్రబాబుకు, లోకేష్ కు చెప్పితే వాళ్లే నీకు రౌడీలును ఏర్పాటు చేస్తారు. జగన్ గాని నేను కానీ నిజంగా రౌడీలు అయితే నువ్వు ఈ పిచ్చి వాగుడు వాగి తిరగగలవా? అని ప్రశ్నించారు. అతను పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తోందని ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదం అని, చిరంజీవి ఇంటి పెద్దగా పవన్ కళ్యాణ్ ఇకపై , పిచ్చి బాషా మాట్లాడకుండా వైద్యం చేయిస్తే మంచిదని, ఇటీవల చిరంజీవి కూడా 5 కోట్లు డబ్బు జనసేన పార్టీకి ఇచ్చి, తమ్ముడిని వెనకేసుకొని వస్తున్నాడని, ఆయన కూడా గతంలో ప్రజా రాజ్యం పార్టీ పెట్టుకొని అందులో నన్ను కూడా చేర్చుకొని ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి కేంద్ర మంత్రి పదవి తీసుకొన్న కమర్షియల్ వ్యక్తి అని విమర్శించారు. పవన్ వాడుతున్న భాష, ఊగిపోతూ రెచ్చిపోవడం పిచ్చి కి సంబంధించిన లక్షణాలే.. తల్లిని తిట్టిన వ్యక్తులతో అంట కాగుతున్న వ్యక్తి పవన్. వివాహ వ్యవస్థను హేళన చేస్తూ భార్యలను మారుస్తున్నాడంటూ పవన్ ను జగన్ విమర్శించడం లో తప్పేమిటి? అదే మన ఇంటిలో అమ్మాయి ని పెళ్లి చేసుకొని వదిలేసిన వ్యక్తి ఫై ఎటువంటి అభిప్రాయం ఉంటుంది. అదే పని 3 సార్లు చేస్తే.. విలువలు లేని అతనిని గౌరవిస్తామా? అని ప్రశ్నించారు. 10 ఏళ్ళు ఎమ్మెల్యే గా పనిచేసి అభివృద్ధి కాదుకదా?కంపోస్ట్ యార్డ్ కూడా ఏర్పాటు చెయ్యలేదని గతంలో అంజిబాబు ను విమర్శించిన పవన్ మరల ఆయనకే టికెట్ ఇచ్చి నన్ను సవాల్ చెయ్యడం ఏమిటి? భీమవరం అభివృద్ధి 2019- 24 మధ్య కాలంలోనే అద్భుతంగా జరిగింది. కంపోస్ట్ యార్డ్ కి ఆరు ఎకరాలు భూమి సేకరించడం కూడా జరిగింది. ఇది అనేక సార్లు ప్రజలకు తెలియజేశాం. మరి మీ స్క్రిప్ట్ ఎవరు రాసి ఇస్తున్నారో కానీ.. మీ అజ్ఞానానికి జోహార్లు.. అని గ్రంధి శ్రీనివాస్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *