సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ను నేటి బుధవారం తో ముగించారు. రేపు పులివెందుల లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వెయ్యనున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇడుపులపాయలో ప్రారంభించిన బస్సు యాత్ర 86 నియోజకవర్గాల మీదుగా సాగింది. విశేష ప్రజాభిమానం మధ్య తన బస్సు యాత్ర సాగిందని 175 కు 175 నియోజకవర్గాలలో వైసీపీ గెలచి చరిత్ర సృష్టించాలని, పార్టీలో మరింత జోష్ వచ్చిందని సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సు యాత్ర 22 రోజులు పాటు 2100 కిలోమీటర్లమేర సాగిన బస్సు యాత్ర ఈయాత్రలో 16 బహిరంగ సభల్లోపాల్గొన్న సీఎం జగన్ 6 ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యారు. 9 చోట్ల భారీ రోడ్ షోల్లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *