సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎలక్షన్ కమిషన్ నేడు, శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరిగే ఎన్నికల్లో అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. అయితే గతంలో ఆరోపణలు ఉన్న సిబ్బంది విధుల్లోకి తీసుకోవద్దని ఈసీ ఆదేశాలుజారీ చేసింది. పోలింగ్ విధుల్లో సిబ్బంది కొరత దృష్ట్యా అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఓపీఓలుగా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని కేటగిరిల వారికి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం-12డి జారీ గడువును మే 1వ తేదీ వరకూ పొడిగిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.గతంలో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు. ఇప్పటి వరకు అంగన్ వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నికల విధుల్లొ పాల్గొనలేదు. ఈసారి ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని, సిబ్బంది కొరత లేకుండా పూర్తిస్థాయిలో నియమించాలనే ఉద్దేశంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *