సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రచారంలో దూసుకొనిపోతున్నారు. ఇప్పటికే తణుకు నియోజకవర్గములో స్థానిక ఓటర్లను స్వయంగా పలు మారులు కలుస్తూ విస్తృత ప్రచారం నిర్వహించడంతో టీడీపీ, జనసేన బీజేపీ శ్రేణులలో జోష్ నెలకొంది. జనసేన లో ఒక వర్గం మాత్రం ఇప్పటికి ఆయనను విభేదిస్తున్నప్పటికీ ఆయన అందరిని కలుపుకొని పోతున్నారు. స్థానిక ఆర్యవైశ్యులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన సభ లో పాల్గొనడమైనది. ఈ సందర్బంగా వారి సమస్యలు, వ్యాపార వివరాలు గురించి అడిగి తెలుసుకొని తాను అండగా ఉంటానని తెలియజేస్తూ రాబోవు ఎన్నికలలో మీ అందరి సహకారంతో తన గెలుపు ఖాయం అని, నియోజక వర్గంలో అన్ని వర్గాల సమస్యలు పరిష్కరిస్తానని అందరు కూటమి కి మద్దతుగా నిలవాలని పిలుపు నిచ్చారు.
