సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, బుధవారం స్థానిక 36, 37, 38,39 వార్డులలో ఇంటింటా ప్రచారంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ , స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. పలుచోట్ల ఆయనకు మహిళలు పుష్పాభిషేకం చేసి హారతులు ఇవ్వడం జరిగింది. తమకు ప్రభుత్వ సంక్షేమాలు అందుతున్నాయని, ఈ కొత్త రోడ్లు, డ్రైన్స్ వేసింది మీరేనని కొందరు ఆయనకు కృతఙ్ఞతలు చెప్పడం జరిగింది. పలువురు ఆయనకు శాలువాలు కప్పి తమ కుటుంబ మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికలల్లో అసెంబ్లీ మరియు ఎంపీ అభ్యర్థుల ఓట్లు రెండు ఫ్యాను గుర్తుపై వేసి తమకు ఘన విజయం చేకూర్చాలని మరో సారి తనకు ఎమ్మెల్యే గా గెలిపిస్తే స్థానికంగా మరింత అభివృద్ధి పనులు చేయించడం జరుగుతుందని ఓటర్లు ను అభ్యర్ధించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వైసీపీ నేతలు , కార్యకర్తలు ఉత్సహంగా పాల్గొనడం జరిగింది. రేపు గురువారం, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్థానిక 11,12,13,14, 15,24 వ వార్డులలో తన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *