సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో నేడు, బుధవారం జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పసుమర్రు దగ్గర బస్సు, టిప్పర్ ఢీ కొని అగ్ని జ్వాలలు ఎగసిపడటంతో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. అక్కడ బైపాస్ రోడ్ పనులు సాగుతున్న క్రమంలో తగిన రహదారి భద్రత చర్యలు తీసుకోవడం, వేగ నియంత్ర చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం సంభవించి ఉండేది కాదని అన్నారు.
