సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బుల్లోడు సునీల్ టాలీవుడ్లో తన కామెడీ ఎంతగా నవ్వించాడో అలాగే హీరోగా విజయాలు అందుకొన్నాడు. మరి పుష్ప తో విలన్ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సాధించాడు. ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాలలో కీలక పాత్రలలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తమిళంలో రజనీకాంత్ ‘జైలర్’, కార్తి’జపాన్’, విశాల్ ‘మార్క్అంథోని’ సూపర్ హిట్ సినిమాలలో విభిన్న పాత్రల్లో ఆయన మెప్పించాడు. మంచి పాలోయింగ్ సాధించాడు. తాజాగా సునీల్ మలయాళ పరిశ్రమశ్ర లో కూడా ఎంట్రీఇచ్చేశారు. అది కూడా 7పదుల వయస్సు లో కూడా వన్నె తరగని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి లేటెస్ట్మూవీ టర్బోలో సునీల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన సునీల్ ఫస్ట్ లుక్పోస్టర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. హిట్లర్ తరహా లుక్ లో ఉన్న సునీల్.. టర్బో సినిమాలో ఆటో బిల్లా అనేక్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు తెలిపారు. . మే23న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో మమ్ముట్టినే నిర్మించాడు. తన సొంత బ్యానర్లో టర్బో సినిమా రానున్నడంతో అభిమానుల్లో అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. ఇక మలయాళ సినీ పరిశ్రమలో కూడా భీమవరం బుల్లోడు సందడి మొదలయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *