సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్డీఏ కూటమి గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. కూటమి సునామి లాగా దూసుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని చోట్ల కూటమిదే హవా. అసెంబ్లీలోనే కాదు.. లోక్‌సభలోనూ సత్తా చాటుతోంది. 175 స్థానాలలో కూటమికి 155 స్థానాలలో ఆధిక్యత సాగిస్తూండగా ..కేవలం 15 స్థానాలలో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. అయితే లోక్ సభ కు మాత్రం కూటమి 20 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా వైసీపీ 5స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతున్నారు, కృష్ణా, విజయనగరం, విశాఖలలో వైసీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయి మెజారిటీని కనబరుస్తున్నారు. గొడవలు జరిగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి తదితర ప్రాంతాలన్నింటిలోనూ కూటమి సత్తా చాటుతోంది. రోజా, కొడాలి నాని, అనిల్ వంటి కీలక నేతలంతా కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటి బాట పట్టారు. కీలక మంత్రులంతా దాదాపు ఓటమి బాటలోనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల విజయోత్సహాలు మిన్నంటుతున్నాయి. వైసీపీకి కంచుకోట అయిన రాయలసీమలోనూ మంచి ఫలితాలు సాధిస్తుంది. కుప్పంలో చంద్రబాబు 5 రౌండ్లకు 9,088వేల మెజారిటీ తో, పవన్ కళ్యాణ్ 6 రౌండల్కు పిఠాపురం 40వేల మెజారిటీ తో కొనసాగుతున్నారు. పులివెందులలో సీఎం జగన్ 5 రౌండ్లకు 21వేల 200 మెజారిటీతో కొనసాగుతున్నారు. ఇక జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 20 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళుతోంది.
