సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలతో గత సాయంత్రం వరకు ఎండలు ఇరగ దీసాయి. ప్రజలు తీవ్ర ఉక్కపోతలతో రాత్రి వరకు ఆపసోపాలు పడుతున్నారు. అయితే గత రాత్రి 9-30 గంటల నుండి అర్ధరాత్రి 1గంటవరకు ఉరుములు మెరుపులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. రోడ్డులు, లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. విద్యుత్తూ సరఫరా అర్ధరాత్రి వరకు మరికొన్ని తెల్లవారు జామువరకు నిలచిపోయింది. పలు ప్రాంతాలలో చెట్టుకొమ్మలు విరిగి పడ్డాయి.నేటి గురువారం మధ్యాహ్నం వరకు వాతావరణం ఆహ్లదంగానే ఉంది. రుతుపవనాలు విసరణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో 5 రోజులు పాటు పశ్చిమ గోదావరి. ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రానికి దగ్గర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *