సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభంజనం లో నరసాపురం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ తన సమీప ప్రత్యర్థి వైసీపీ పార్టీ గూడూరి ఉమాబాల ఫై 2లక్షల 76, 802 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. ఆయనకు మొత్తం 7లక్షల 7వేల 743 ఓట్లు లభించగా గూడూరి ఉమాబాలకు 4లక్షల 30వేల 541 ఓట్లు రాగా కాంగ్రెస్ అబ్యర్థి కేబీఆర్ నాయుడు 36, 213 ఓట్లు సాధించడం గమనార్హం. గత 35ఏళ్లుగా ఒక బాహుబలిగా ఎక్కడ పార్టీ మారకుండా బీజేపీ పార్టీ ప్రతిష్టకోసం ఒక కార్యకర్తగా నిబద్దత తో పనిచేసిన,భీమవరం పట్టణ అభివృద్ధికి కోట్ల రూపాయల కేంద్ర నిధుల సమీకరణలో తనవంతు కృషి చేసిన మా ఆత్మీయ మిత్రులు శ్రీనివాస వర్మ కు సిగ్మా న్యూస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
