సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నిలిపివేసిన నేపథ్యంలో దేశీయ మార్కెట్ లో సూచీలు నిన్న భారీ లాభాలు సాధించిన నేడు మంగళవారం తీవ్రంగా ఉగిసలాడి చివరకు స్వల్ప నష్టాలతో ముగిసాయి. బ్యాంకింగ్ సెక్టార్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను వెనక్కి లాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95. 68) బలపడింది. గత సెషన్ ముగింపు (76,835)తో పోల్చుకుంటే నేడు మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంతో 76,928 వద్ద కొనసాగుతోంది.అయితే నేటి సాయంత్రానికి సుమారు 70 పాయింట్స్ నష్టాలతో ముగిసింది. అలానే మరో వైపు నిఫ్టీ కూడా ఉదయం 24 పాయింట్ల లాభంతో 24,020 వద్ద మళ్లీ 24 వేల మార్క్‌ను దాటినప్పటికీ సాయంత్రానికల్లా 10 పాయింట్స్ నష్టంతో 23,987 వద్ద ముగిసింది.
