సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరులో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ప్రభుత్వ యువజన సర్వీస్‌లశాఖ, సెట్‌వెల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 15న కలెక్టరేట్‌ కాంపౌండ్‌లోని సెట్‌వెల్‌ కార్యాలయంలో ఉదయం పది గంటలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణ రావు ఓ ప్రకట నలో పేర్కొన్నారు. స్పందన, స్ఫూర్తి ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వూ జరుగుతుందన్నారు. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ పురుషులకు రూ.12,500 నుంచి ప్రారంభమై బదిలీ అలవెన్స్‌, ఇన్‌సెంటివ్స్‌, ఉచిత భోజన, వసతి సౌకర్యం, ఆరోగ్యబీమా రూ.4 లక్షలు, ప్రమాద బీమా రూ.20 లక్షలు ఇవ్వబడుతుందన్నారు. ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతలు.. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగంలో అనుభవం ఉండాలని, 21 నుంచి 27 ఏళ్ళ లోపు వయసు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలన్నారు.. వివరాలకు 88868 82032 నంబరులో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *