సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ఆదివారం నాడు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విజయవాడ, విశాఖపట్నం సహా అనేక పట్టణాల్లో,నిన్న సాయంత్రం నుండి కుండపోతగా భారీ వర్షం కురిసింది. ఇంకా ఆయా నగరాలు నేడు, సాయమవరం , రేపు, ఎల్లుండి కూడా వర్ష సూచన ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షం వలన ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంకా మూడు లేదా నాలుగు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురవనుంది. వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లా సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉమ్మడి జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం మరో 2 రోజులు పటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలను అలర్ట్ చేస్తుంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర ఉక్కపోత ఉంటుంది. గత 4 రోజులుగా రోజు ఉదయం నుండి భానుడు ప్రతాపం చూపిస్తుండటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *