సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో నేడు, సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు( గూడ్స్ రైలు ను ఎక్స్ ప్రెస్ రైలు ) ఢీ కొనడంతో ఓ బోగీ గాల్లోకి లేచి నిలబడిపోయి ప్రమాద తీవ్రత ను తెలియజేస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు ప్రయాణికులు మృతిచెందగా.. సుమారు 40 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్యా పెరిగే అవకాశం ఉంది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా ఎక్స్ ప్రైస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రైల్వే సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రెడ్ సిగ్నల్‌ను వేసిన గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
