సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సోమవారం పోలవరం అంటూ ప్రకటించిన చంద్రబాబు ఇవాళ ప్రాజెక్ట్ను సందర్శించారు. నాలుగైదు గంటలపాటు ప్రాజెక్ట్ అంతా పరిశీలించిన సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ,, 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత దూరదృష్టితో పోలవరం ముంపు ప్రాంతంలోని తెలంగాణాకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేయించామని అన్నారు. అప్పటికే పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభాల్లో ఉందని, 2005లో మాజీ సీఎం స్వర్గీయ వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్టు పనుల లో చాల అడ్డంకులు వచ్చాయని కాగా రాష్ట్ర విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని చెప్పారు. ఇక డ్యామ్ ఎత్తు 45.72 మీటర్ల డ్యాం ఎత్తు ఉంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, ఆ ఎత్తును తగ్గించడానికి ప్రయత్నించారని చంద్రబాబు అన్నారు. స్పిల్ వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్లేలా డిజైన్ చేశామని, చైనాలో త్రీ గార్జియస్ ప్రాజెక్టు ద్వారా మాత్రమే అంత ఎక్కువ వాటర్ డిశ్ఛార్జి అవుతోందని పేర్కొన్నారు. సీఎం జగన్ పోలవరం ను బ్రష్టు పట్టించారని, రాజకీయాల్లో ఉండ తగని వ్యక్తి అని మాజీ సీఎం జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఆయన రావడం తప్పు కాదు. క్షమించరాని నేరం. అప్పటి నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు. వైసీపీ ప్రభుత్వం రావడమే రివర్స్ టెండరింగ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే కాంట్రాక్టు ఏజెన్సీని మార్చేశారు. 2020 వరదల్లో డయాఫ్రం వాల్ 35 శాతం పాడయ్యింది. రూ.480 కోట్లతో అత్యవసరంగా నిర్మిస్తే దానిని అలా చేశారు’’ అని ఆరోపించారు. ఏది ఏమైనా అంకిత భావంతో ప్రాజెక్టు పూర్తీ చేస్తామన్నారు.
