సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల వినియోగంపై.. వాటిలో కొన్ని ఈవీఎంలు హ్యాక్ గురి అయ్యాయని తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫలితాలు రోజు ప్రజల సంక్షేమానికి పంచిన డబ్బులు తీసుకొన్న అవ్వాతాతలు , అక్క చెల్లమ్మల, విద్యార్థుల ఓట్లు ఆప్యాయతలు ఎటు పోయాయో? ఎదో జరిగింది అనిపిస్తుంది .. కానీ ఆధారాలతో నిరూపించలేని పరిస్థితి అంటూ కన్నీటి పర్యంతం చేసిన వ్యాఖ్యలు కు, ఇండియా కూటమి నేతలు, ఎలాన్ మాస్క్ సంచలన వ్యాఖ్యలకు కొనసాగింపుగా తాజాగా నేడు, మంగళవారం ఉదయం ఒక సంచలన ట్విట్ విడుదల చేసారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియల్లో అభివృద్ధి చెందిన దాదాపు అన్ని ప్రజాస్వామ్య దేశాలు ఇంకా పేపర్ బ్యాలెట్లను ఓట్లకు ఉపయోగిస్తున్నాయని, ఈవీఎంలను వాడడం లేదని జగన్ అన్నారు. ‘మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని చాటిచెబుతూ మనం కూడా పేపర్ బ్యాలెట్స్ దిశగా అడుగులు వేయాలి’ న్యాయం జరిగినట్లు కాదు.. జరిగినట్లు కనిపించాలి. అని అన్నారు..కాగా జగన్ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగానే టీడీపీ, జనసేన .. ఇంకా జగన్ ఓటమి షాక్ నుండి తేరుకోలేదు అంటూ కౌంటర్ ఇచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *