సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం బీజేపీ ఎంపీ, భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా ఢిల్లీలోని తన క్యాబిన్ లో నేడు, మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఉక్కు శాఖ, భారీ పరిశ్రమలు సహాయ మంత్రిగా తన ఛాంబర్‌లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు శ్రీనివాస వర్మ తో పాటు ఢిల్లీ చేరుకొన్న ఏపీ బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, తణుకు ఎమ్మెల్యే,అరమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, సోము వీర్రాజు, రమేశ్ నాయుడు , మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో పాటు పలువురు పాల్గొన్నారు.కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక వర్మ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తనకు అత్యంత కీలకమైన శాఖలు కేటాయించారని, ఇది హోదా కాదని పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని దేశాభివృద్ధి తో పాటు తన మూలాలు ఉన్న భీమవరం, నరసాపురం పార్లమెంట్ స్థానం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని, గత 34 ఏళ్లుగా ఎలా బీజేపీ సామాన్య కార్యకర్తగా పనిచేసానో అదే విధంగా అందరికి అందుబాటులో ఉంటాయని ప్రజా సేవ చేస్తానని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూటమి పార్టీలతో పాటు బీజేపీ వర్మ సన్నిహితులు సందడి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *