సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గద్దర్ 2 సినిమా 600 కోట్ల బంపర్ కలెక్షన్స్ కొల్లగొట్టిన బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ తో తెలుగు లో క్రాక్, బాడీగార్డ్ వంటి పలు హిట్ సినిమాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నేడు గురువారం తెలుగు, హిందీతో పాటు అధికారికంగా నేడు, గురువారం పాన్ ఇండియా సినిమా ప్రకటించారు. ఈ సినిమాని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలుగా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. హిందీలో తెరకెక్కించినా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తారని సమాచారం. అయితే నిజానికి ఈ సినిమా మైత్రి మూవీస్ .రవితేజ – గోపీచంద్ మలినేని కాంబో సూపర్ హిట్ హ్యాట్రిక్ కాంబో. వీరి కాంబోలో నాలుగో సినిమా కూడా ప్రకటించారు. కానీ బడ్జెట్ పెరిగిపోయింది అని రవితేజ మార్కెట్ మీద అంత బడ్జెట్ సెట్ అవ్వదని ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లు? వార్తలు వచ్చాయి. అయితే అదే కథని గోపీచంద్ బాలీవుడ్ లో సన్నీ డియోల్ కి చెప్పాడని, సన్నీ ఓకే చెయ్యడంతో ఆ సినిమాని నేడు అధికారికంగా ప్రకటించారని ఫిల్మ్ నగర్ టాక్.. ఏది ఏమైనా సన్నీ డియోల్ తెలుగు హీరోగా ఈ సినిమా తో పరిచయం కావడం విశేషం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *