సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:నేడు, గురువారం తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా హాజరు అయిన కీలక వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ ఎన్నికలలో పరాజయం ఫై సమీక్ష నిర్వహించారు. తదుపరి వారికీ దిశానిర్దేశ్యం చేస్తూ.. ఇది శకుని మాయ పాచికలు ఉదంతంలో పాండవులు ఓడిన తీరును తలపిస్తుందని, మనం ధర్మం గా నిలబడ్డాం..వారు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి గెలిచారు. రాష్ట్రం లో ప్రతీ కుటుంబానికి, ప్రతీ గడపకు మనం చేసిన మంచి ఏమిటో తెలుసు. ఈరోజుకీ వైఎస్ జగన్ అంటే అబద్దాలు చెప్పుడు.. మోసం చేయడు అని వారికి తెలుసు. ఇచ్చిన వాగ్దనాలు నెరవేర్చడానికి 6 నెలలు సమయం ఇస్తాం . వీరి నిజ స్వరూపం, కూటమి హనీమూన్ ఈ 6 నెలలు లోనే ప్రజలకు తెలిసిపోతుంది. వారు ఎంత మోసపోయారో .. జగన్ పాలన విలువ ఏమిటో అర్ధం అవుతుంది. ఇదే ప్రజలు 2029 నాటికి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైఎస్సా ర్సీపీని అధికారంలోకి తేవడం ఖాయం.. ఇది మనకు విరామం మాత్రమే.. ఎన్నికల్లో మనకు 40 శాతం ఓట్లు పోల్ అయ్యాయని మనం మర్చిపోకూడదు.2019లో పోలిస్తే కేవలం 10 శాతం ఓట్లు తగ్గాయి. శిశుపాలుడిలా చంద్రబాబు పాపాలుపండే కొద్దీ, ప్రజలతో కలిసి వైసీపీ పోరాటాలు చేస్తాం. మనకు వచ్చిన సంఖ్యాబలం తక్కువే. ఈసారి అసెంబ్లీలో ఏకంగా స్పీకర్ పదవికి తీసుకుపోయే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ..జగన్ ఓడిపోయాడు..కానీ చనిపోలేదు చచ్చేదాకా కొట్టాలి.. నీచపు మాటలు అంటున్నవారికీ ‘అసెంబ్లీ స్పీకర్’ పదవి ఇస్తున్నారు. జగన్ పాలన హయాంలో… కులం, మతం, ప్రాంతం చూడకుండా.. ఏ పార్టీకి ఓటు వేశారని చూడకుండా..అందరికి సంక్షేమం అందించాం. అందరి పిల్లలను చదివించాను. ఇల్లు, స్థలాలు ఆరోగ్యశ్రీ అందించాం. కానీ ఇవాళ వారి పార్టీకి ఓటు వేయలేదని వైసీపీ మనుషులపై దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. గాయపరుస్తున్నారు.. చంపుతున్నారు కూడా.. శిశుపాలుడి పాపాలు చాలా వేగంగా పండుతున్నాయి. టీడీపీ దాడులలో నష్టపోయిన ప్రతి వైసీపీ మద్దతుదారుడిని వైసీపీ పార్టీ ఆదుకొంటుంది. నేను స్వయంగా నష్టపోయిన ప్రతి కార్యకర్త గృహానికి వస్తా.. వారి కుటుంబానికి కావలసిన సాయం, భరోసా అందిస్తా.. .ధర్మం గా మనం ఓడిపోలేదు. మనం మేలు చేసాం కాబ్బటి ప్రజల మధ్యకు మరల తలెత్తుకుని పోగలం. వైసీపీ రాష్ట్రంలో, ఎంపీటీసీ, జడ్పీటిసి , ఎంపీటీసీ మునిసిపల్ కార్పొరేట్ పదవులలో చాల బలంగా ఉంది. ఎవరి ప్రలోభాలకు, కక్ష సాధింపులకు లొంగకండి.. అన్నారు జగన్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *