సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నేడు, గురువారం ఉదయం నందమూరి గురువు గ్రామం లోని మహిమానిత్వ శ్రీ అంజనేయ స్వామీ వారిని దర్శించి పూజలు నిర్వహించారు తరువాత వీరవాసరం లోని యం.ఆర్.కే జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పుస్తకాలు బ్యాగ్ లు కూడిన కిట్లను పంపిణి చేసారు. ప్రభుత్వ సహాయంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి వారి తల్లిదండ్రులకు విద్య సంస్థకు మంచి పేరు తీసుకొని రావాలి అని చెప్పారు. ఈ కార్యక్రమం లో వీరవాసరం ZPTC గుండా జయప్రకాష్ మాజీ AMC చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు , , MPP దుర్గాభవాని ,వీరవాసరం MEO మరియు వీరవాసరం మండలం జెడీపీటీసీలు ,సర్పంచ్ లు పాల్గొన్నారు
