సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టాణానికి చెందిన పులపర్తి సాయి నేడు, శుక్రవారం మీడియా సమావేశంలో.. తనకు ఈ జూన్ నెల 15వ తేదీన శనివారం రాత్రి హైదరాబాద్ ఫిలింనగర్ జేఆర్ఎస్ కన్వెన్షన్లో జరిగినవేడుకలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజా దరణ పొందిన వైశ్య ప్రతినిధులకు అందించే ఆర్యవైశ్య లైం లైట్ -2024 మెన్ అవార్డు పులపర్తి సాయి కి లభించింది. ఈ పురస్కారం తెలంగాణ రాష్ట్ర మంత్రి, దుదిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా అందుకొన్నట్లు తెలిపారు. . ఈ ప్రతిష్టాత్మ కమైన అవార్డు కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు ఆన్లైన్ ఓటింగ్లో పాల్గొనగా, వైశ్య లైడ్లైట్ అవార్డును 8,507 ఓట్లతో ప్రజలతో ఎన్నుకోబడిన పులపర్తి సాయి రన్నరప్ గా నిలిచారు. ఆర్య వైశులకు స్వయంవరం వివాహ వేదిక ద్వారా 2500 పైగా వివాహాలు చేయించిన సేవలకు గుర్తింపుగా అవార్డు అందుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర చైర్ పర్సన్ కాలువ సుజాత, ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఆవార్డు ప్రదానోత్సవ నిర్వాహకులు యిమ్మడి శివకుమార్, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొ న్నారు. కాగా, తన గెలుపుకోసం ఓటింగ్లో పాల్గొన్న మిత్రులకు అవార్డు గ్రహీత పులపర్తి సాయి ధన్యవాదాలు తెలిపారు. భవిషత్తు లో ‘గో గ్రీన్’ అనే పకృతి పచ్చదనం అనే సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.
