సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నీటి ఎద్దడితో గతంలో వేసవిలో కూరగాయల ధరలు బాగా పెరిగేవి. వర్షాకాలం లో ధరలు తగ్గుతాయి. కానీ దానికి విరుద్ధంగా ఇటీవల 2వారాలుగా కూరగాయలు ధరలు అడ్డు అదుపు లేకుండా విపరీతంగా ధరలు పెరిగిపోతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు బజార్ల ద్వారా పేదలకు, సామాన్యులకు కూరగాయలను సబ్సిడీ ధరలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతున్న దృష్ట్యా అధికారులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నేరుగా రైతుల వద్దే కూరగాయలు కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరల్లో విక్రయించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మదనపల్లె నుంచి టమాటాను కొనుగోలు చేయాలని సూచించారు. భీమవరం రైతు బజార్లో పాడుబడిన ఆర్వో ప్లాంటును రూ.40 వేలతో వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. అలాగే అక్కడ నాలుగు టాయిలెట్లు మరమ్మతులకు ప్రతిపాదనలు అందజేయాలన్నారు. మాంసం దుకాణాల వద్ద ధరల పట్టికట్టిను తప్పనిసరిగా ప్రదర్శించాలని, వాహనదారులకు పార్కింగ్ స్థలాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసారు కలెక్టర్ సుమిత్ కుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *