సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని వేటపాలెం రామాపురం బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగ ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థుల గల్లంతు అవగా నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారిద్దరూ కూడా మరణించినట్లు మత్యకారులు చెబుతుండగా.. మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు సహాయక సిబ్బంది ప్రకటించారు. మృతులను నితిన్, కిషోర్, తేజ, అమలరాజ్‌గా గుర్తించారు. అలల తాకిడికి ఒక్కసారిగా నలుగురు విద్యార్థులు కొట్టుకుపోయినట్లు తెలిపారు. సహాయం కోసం కేకలు వేసిన ఉపయోగం లేకపోయిందని, వారిని ఏలూరు నుంచి వచ్చిన 11 మంది విద్యార్థులుగా గుర్తించారు. వారితోపాటు వచ్చిన స్నేహితులు శోకసంద్రంలో మునిగితేలారు. మృతుల బంధువులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు వేటపాలెం పోలీసులు తెలిపారు.

[vuukle]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *