సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో కలిసి ఉండి MLA రఘురామకృష్ణంరాజు , పాలకొల్లు కు చెందిన Ex.MLC అంగర రామ్మోహనరావు శుభాకాంక్షలు తెలియజేసారు. నిజానికి రఘురామా ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి తనకు కేటాయిస్తే బాగుంటుందని ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడే కోరుకొన్నారు, కానీ.. ఆ కోరిక నెరవేరలేదు. అయినప్పటికీ, అసెంబ్లీ లో ఎమ్మెల్యే రఘురామ మాట్లాడుతూ.. అయ్యన్న 7 సారులు ఎమ్మెల్యే, 4 సారులు మంత్రి ఆ విషయాల జోలికి వెళ్ళాను.. అందరు అయ్యా అనుకునే టీడీపీ పార్టీ వారికీ అన్నలాంటి ప్రజలకు పాత్రుడు అయిన అయ్యన్న పాత్రుడుకి ఆ పేరు పెట్టిన తల్లి తండ్రులు ధన్యులు అన్నారు. అయితే అయ్యన్న పాత్రుడి ప్రమాణ స్వీకారానికి ఆయనను సీటులో గౌరవంగా కూర్చోబెట్టే కార్యక్రమానికి ప్రతిపక్షము హాజరు కావలసి ఉండగా వైసీపీ అధినేత జగన్ కానీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు గాని ఒక్కరు సభలో లేకపోవడం గమనార్హం.
