సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టులో విచారణ నేటి గురువారం ముగిసింది. తదుపరి కోర్ట్ ఉత్తర్యులు వచ్చే వరకు యధాతథ పరిస్థితులు కోనగేలా స్టేటస్ కో ఆదేశాలు హైకోర్టు జారీ చేసింది. ఇప్పటి వరకు జరిగిన విచారణపై హైకోర్టు తీర్పు ను రిజర్వ్ చేసింది. ఏపీ ప్రభుత్వం తో న్యాయపోరాటం కొనసాగించాలని వైఎస్సా ర్సీపీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాష్ట్ర వ్యాప్తంగా 11 వైఎస్సా ర్సీపీ పార్టీ కార్యాలయాలకు అక్రమ
కట్టడాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులపై పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే మరికొన్ని కార్యాలయాలకు ఇచ్చిననోటీసులను సవాల్ చేస్తూ.. ఏపీ హైకోర్టులో ఇవాళ మరో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది వైసిపి పార్టీ..
