సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీహార్ కు ప్రత్యేక హోదా కావలసిందే అంటూ నితీష్ కుమార్ ప్రధాని మోడీని పట్టు బడుతుండటం , మరో వైపు రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవలసిందే నాని డిమాండ్ మొదలు పెట్టిన నేపథ్యంలో నేడు, పార్లమెంట్ సమావేశ భవనం ఆవరణలో ఏపీకి చెందిన బీజేపీ నరసాపురం ఎంపీ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం కదా ? ఎన్నో వేల కోట్ల నిధులు ఏపీ అభివృద్ధికి కేటాయిస్తున్నాము. ఇంకేమిటి అని వ్యాఖ్యానించారు. అలాగే.. బీహార్ అసెంబ్లీ ప్రత్యేక హోదా తీర్మానం చేసినంత మాత్రానా , జేడీయూ తీర్మానాలు చేసినంత మాత్రాన హోదా వస్తుందా? అని మీడియాను ప్రశ్నించారు. ‘‘కేంద్రంలో, రాష్ట్రం లో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం అనేది తీర్మా నాలు చేసి ఇచ్చే అంశం కాదు. ప్రత్యేక హోదా లేదనేది బీహార్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది. అక్కడ కూడా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉంది’’ అన్నారు. .. సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వస్తారని, ఎంపీలతో సమావేశం అవుతారని, రాష్ట్రానికి సంబంధించిన పోలవరం తో సహా అన్ని అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చిస్తామని అన్నారు. పొలవరంప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందా? లేదంటే కేంద్రం నిర్మిస్తుందా? అనేది కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయిస్తుందన్నారు.
